.:: వీఆర్‌వో/వీఆర్‌ఏకు 11 లక్షల దరఖాస్తులు ::.

వీఆర్‌వో పోస్టులకు దరఖాస్తు చేసుకున్నవారిలో లక్షా యాభై వేల మంది బీటెక్‌ అభ్యర్థులు

రాష్ట్రంలో వీఆర్‌వో/వీఆర్‌ఏకు రికార్డు స్థాయిలో మొత్తం 11, 56, 061 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో వీఆర్‌వోకు 10,02,473 మంది దరఖాస్తు చేసుకుంటే... వీఆర్‌ఏకు 1,17,636 దరఖాస్తులు వచ్చాయి. రెండు పోస్టులకూ దర ఖాస్తు చేసుకున్నవారు 35952 మంది. రెండు పోస్టులకు కలిపి ఇప్పటివరకూ 11, 56, 061 దరఖాస్తులు వచ్చాయి. వీఆర్‌వో పోస్టులకు దరఖాస్తు చేసుకున్నవారిలో లక్షా యాభై వేల మంది బీటెక్‌ అభ్యర్థులుండటం విశేషం.

జిల్లాలవారీగా చూసుకుంటే... అత్యధికంగా గుంటూరులో 105840 దరఖాస్తులు వచ్చాయి. 95854 దరఖాస్తులతో కరీంనగర్‌ రెండో స్థానంలో నిలిచింది. ఇక విశాఖపట్నం అతి తక్కువగా కేవలం 5603 దరఖాస్తులు వచ్చాయి. రాష్టవ్య్రాప్తంగా మొత్తం 1172 వీఆర్‌వో, 6029 వీఆర్‌ఏ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దరఖాస్తులకు గడువు డిసెంబర్‌ 29, 2011తోనే ముగిసింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో వయోపరిమితికి రెండేళ్ల సడలింపు దష్ట్యా గడువును జనవరి 18, 2012కి పెంచారు.
www.sakshieducation.com

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post