.:: టెట్ ఫైనల్ కీ విడుదల: అదనపు మార్కులు ::.

హైదరాబాద్, న్యూస్‌లైన్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) ఫైనల్ కీ విడుదల చేసినట్టు ఏపీటెట్ డెరైక్టర్ శేషుకుమారి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 8న నిర్వహించిన టెట్ పరీక్ష ప్రాథమిక కీని 11వ తేదీన విడుదల చేశారు. మొత్తం 3,950 అభ్యంతరాలు రాగా సబ్జెక్టు నిపుణులు వీటిని పరీక్షించి అదనపు మార్కులు కలిపారు. పేపర్-1కు 6 మార్కులు, పేపర్-2(మ్యాథ్స్ అండ్ సైన్స్)కు 4 మార్కులు, పేపర్-2(సోషల్ సెన్సైస్)కు 6 మార్కులు చొప్పున కలుపనున్నారు. ఫైనల్ కీ http://aptet.cgg.gov.in వెబ్‌సైట్‌లో చూడవచ్చు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post