ఇక శిరస్సు వంచే పరిస్థితి ఉండదు: జగన్

రానున్న ఎన్నికల్లో 35 ఎంపీ సీట్లను గెలుస్తాం
చిలుకలూరిపేట: దేశ రాజధానిలో శిరస్సు వంచే పరిస్థితి రాష్ట్రానికి రాకుండా
చూస్తానని వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రజలకు హామీ ఇచ్చారు. చిలుకలూరిపేటలో
ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ... కోవూరులో ప్రసన్నకుమార్‌రెడ్డి
గెలుపుకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. కోవూరు తీర్పు
విలువులు లేని, విశ్వసనీయతలేని రాజీకీయాలకు మార్పుగా ఉంటుందన్నారు. ఉప
ఎన్నికల ఫలితాల అనంతరం చంద్రబాబు మీడియా సమావేశం చేసిన వ్యాఖ్యలను జగన్
తీవ్రంగా విమర్శించారు. అవినీతికి ఓటేసినారని చంద్రబాబు వ్యాఖ్యనించడంపై
జగన్ మండిపడ్డారు. కోవూరు ఉప ఎన్నికల్లో డబ్బులు పంచింది నీవుకాదా అన్ని
ప్రశ్నించారు. చంద్రబాబుకు ఇంకెన్నడూ బుద్ది వస్తోందోనని ఆయన
వ్యాఖ్యానించారు. తాను ఓటుకు 500 రూపాయల ఖర్చు పెట్టలేదని జగన్ అన్నారు. బెల్టు
షాపులు, హెరిటేజ్ డైరీని పెట్టింది తాను కాదని ఆయన అన్నారు.
తొమ్మిదిసార్లు ముఖ్యమంత్రి పనిచేసిన చంద్రబాబు విద్యార్థుల భవిష్యత్
గురించి ఎపుడైనా ఆలోచించారా ధ్వజమెత్తారు. సీబీఐ విచారణకు
తప్పించుకోవడానికి చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి చిదంబరంను కలిశాడని జగన్
అన్నారు. తాను అటువంటి నీతిమాలిన పనులకు పాల్పడలేదన్నారు. రానున్న
ఎన్నికల్లో 35 ఎంపీ సీట్లను గెలుచుకొని రాష్ట్రానికి వ్యవసాయశాఖ మంత్రిని,
రైల్వే శాఖను రాష్ట్రానికి వచ్చేటట్టు చేస్తానని జగన్ ఆవేశంగా
ప్రసంగించారు. కేంద్రానికి వెళ్లి చేతులు ముడుచుకుని యాచించే పరిస్థితిని
మారుస్తానని ఆయన అన్నారు. తాను ఏ ఒక్కరోజైనా సచివాలయానికి
వెళ్లలేదని, ఏ అధికారికి, మంత్రికి ఫోన్ చేయలేదని.. ఎలాంటి అన్యాయానికి
పాల్పడినట్టు నిరూపిస్తారా అని చంద్రబాబును ప్రశ్నించారు. ఆనాడు
నల్లకాలువలో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నందుకే తాను ఇన్ని కష్టాలు
పడుతున్నానని... తాను ఒంటరిని కాదని, తనకు మహానేత వైఎస్‌ఆర్ అతిపెద్ద
కుటుంబాన్ని ఇచ్చారని జగన్ అన్నారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post