ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాలు విడుదల


హైదరాబాద్ : ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సర ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. మాధ్యమిక విద్యాశాఖమంత్రి పార్థసారధి ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో 53.75 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులు అయినట్లు మంత్రి తెలిపారు. బాలుర ఉత్తీర్ణత శాతం 49.73 కాగా, బాలికలు 58.32 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఈసారి కూడా ఫలితాల్లో బాలికలదే పైచేయిగా నిలిచింది.

మార్కులు, గ్రేడ్ల వివరాలను 32 వెబ్‌సైట్లు, ఈసేవా కాల్‌సెంటర్ నంబర్లు, ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్, ఎస్.ఎం.ఎస్.ల ద్వారా తెలుసుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి ఎం.సుబ్రమణ్యం ఒక ప్రకటనలో తెలిపారు.

వెబ్‌సైట్లు ఇవీ: www.sakshi.com; www.sakshitv.com
www.sakshieducation.com; http://examresults.ap.nic.in
http://results.cgg.gov.in; www.apit.ap.gov.in;
వీటితోపాటు ఇతర ప్రైవేటు వెబ్‌సైట్ల ద్వారానూ వివరాలు తెలుసుకోవచ్చు.

కాల్‌సెంటర్లు : ఈసేవా నంబరు 1100కు ఏదైనా బీఎస్‌ఎన్‌ఎల్ ల్యాండ్‌లైన్ ద్వారా గానీ లేదా 18004251110 నంబర్‌కు ఏదైనా ల్యాండ్‌లైన్ నుంచి లేదా సెల్ నుంచి ఫోన్ చేస్తే.. వివరాలు తెలుస్తాయి. ఈసేవా, మీసేవా, ఏపీఆన్‌లైన్, రాజీవ్ సిటిజన్ సెంటర్లలో కూడా ఫలితాలు అందుబాటులో ఉంటాయి.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post