సీతమ్మ వాకిట్లో విరిసిన అనుబంధాలు

ఈ మధ్య కాలంలో మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకునే సినిమాలే ఎక్కువగా వస్తున్నాయి. హీరోయిజానికీ ... డాన్స్ లకి ... ఫైట్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ నిస్తూ ఈ సినిమాలు ముందుకు సాగుతున్నాయి. ఇక తెరపై ప్రేమ కథల హవా పెరిగినా వాటిలో లవ్ ఫీల్ వర్కౌట్ అవుతుందే తప్పా, ఫ్యామిలీ సెంటిమెంట్ మచ్చుకి కూడా కనిపించడంలేదు. ఈ నేపథ్యంలో వెంకటేష్ - మహేష్ బాబు కాంబినేషన్లో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రం రూపొందుతోంది.
అనుబంధాలకు ... ఆత్మీయతలకు అద్దంపడుతోన్న ఈ సినిమా, సరికొత్త ట్రెండ్ కి శ్రీకారం చుట్టే అవకాశం కనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు. దిల్ రాజు నిర్మాణంలో శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో కొన్ని కీలకమైన సన్నివేశాలను తమిళనాడు - కుట్రాలంలో తెరకెక్కించారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. సమంతా - ప్రకాష్ రాజ్ లపై కొన్ని ముఖ్యనైన సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరిస్తున్నారు. నెలాఖరు వరకూ జరిగే ఈ షెడ్యూల్లో ఈ రోజు నుంచి వెంకటేష్ పాల్గొననున్నట్లు చెబుతున్నారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post